కనిష్ఠానికి పడిపోయిన బంగారం ధర !

Telugu Lo Computer
0


బంగారం ధర స్వల్పంగా క్రిందకు దిగి, 20 రోజుల కనిష్టానికి పడిపోయింది. నిన్న రూ. 62,950 రూపాయల వద్ద క్లోజింగ్ ను చూసిన గోల్డ్, ఈరోజు కూడా రూ. 120 రూపాయలు క్రిందకు దిగి రూ. 62,830 రూపాయల వద్ద క్లోజింగ్ ను చూసింది. డిసెంబర్ 20 న 10 గ్రాముల 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర రూ. 63,000 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగింది. అయితే, గోల్డ్ రేట్ డిసెంబర్ నెల చివరి నాటికి బాగా పుంజుకున్న బంగారం ధర డిసెంబర్ 28న రూ. 64,250 రూపాయల గరిష్ట ధరను సెట్ చేసింది. కానీ, డిసెంబర్ 31 నాటికీ మార్కెట్ స్వల్పంగా నష్టాలను చూడటంతో రూ.63,870 రూపాయల రేటును నమోదు చేసింది. కానీ, 2024 జనవరి ప్రారంభం గోల్డ్ రేట్ మరలా తిరిగి పుంజు కోవడంతో జనవరి 2న గోల్డ్ రేట్ మళ్ళీ 64 వేల రూపాయల మార్క్ పైకి చేరుకుంది. జనవరి 2న 10 గ్రాముల 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర రూ. 64,090 రేటు వద్ద కొనసాగింది. అయితే, ఎక్కువ సమయం స్థిరంగా నిలబడలేని గోల్డ్ రేట్ తిరిగి పతనాన్ని చూసింది. 3 జనవరి 2024 నుండి మొదలైన గోల్డ్ మార్కెట్ పతనం ఈరోజు వరకూ కూడా వెంటాడింది. మొత్తంగా, గడిచిన 10 రోజుల్లో గోల్డ్ రేట్ రూ. 1,230 రూపాయల పతనాన్ని చూసి ఈరోజు రూ. 63,870 రూపాయల వద్ద నిలిచింది.

Post a Comment

0Comments

Post a Comment (0)