బ్యాంకులోకి చొరబడ్డ ఎద్దు !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లోని షాహ్‌గంజ్ ప్రాంతంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో కస్టమర్లు వాళ్లు వెళ్లిన పని పూర్తి చేసుకోవడానికి, వాళ్లకు ఇచ్చిన టోకన్ నంబర్ ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తున్నారు. అప్పుడు అకస్మాత్తుగా ఆ బ్యాంకులో పెద్ద ఎద్దు దర్శనం ఇచ్చింది. ఈ ఘటనతో బ్యాంకు సిబ్బందితో పాటు కస్టమర్లు షాక్‌కు గురయ్యారు. ఎద్దు బ్యాంకులోకి ప్రవేశించడంతో ఆ బ్యాంకులో ఏం జరుగుతుందో అంటూ కొంతసేపు అందరూ టెన్షన్ గా ఎదురు చూశారు. దీంతో ఆ బ్యాంకు కస్టమర్లు, సిబ్బందిలో భయం నెలకొంది. కొంతసేపటి తరువాత బ్యాంకు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు కర్రతో ఎద్దును బ్యాంకులో నుంచి బయటకు తరిమికొట్టేందుకు ప్రయత్నించాడు. సెక్యూరిటీ గార్డు ఆ ఎద్దును వెంబడించడంతో ఎద్దు బయటకు పారిపోవడం వీడియోలో కనిపించింది. ఈ  వీడియో వైరల్ అయ్యింది. బ్యాంకు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బ్రాంచ్ వెలుపల రెండు ఎద్దులు పరస్పరం దాడి చేసుకోవడంతో ఓ ఎద్దు బ్యాంకులోకి ప్రవేశించింది. అనంతరం ఓ వ్యక్తి ఆ ఎద్దు మీద దాడి చేసేందుకు బ్యాంకులోకి ప్రవేశించారు. తెరిచిన తలుపు ఎద్దు లోపలికి రావడానికి సులభతరం అయ్యిందని అధికారులు అంటున్నారు. దీంతో కొద్దిసేపు బ్యాంకు కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. అదృష్టవశాత్తూ బ్యాంకులో కస్టమర్లు తక్కువగా ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది అని బ్యాంక్ చీఫ్ మేనేజర్ గౌరవ్ సింగ్ స్థానిక మీడియాకు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)