స్వీడెన్‌లో చలి తీవ్రతికి మకుటంలా తయారయైన తల వెంట్రుకలు !

Telugu Lo Computer
0


స్వీడెన్‌లో మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ వాతావరణంతో ఆ దేశానికి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన ఓ ఫీట్ అందర్నీ స్టన్ చేస్తోంది. ఎల్విరా లుండ్‌గ్రెన్ అనే మహిళ తన తల వెంట్రుకల్ని ఆ వీడియో క్లిప్‌లో ప్రజెంట్ చేసింది. అయితే విపరీతమైన చలిలో ఆమె కురులు గడ్డకట్టుకుపోయాయి. తల వెంట్రుకలు ఓ మకుటంలా తయారయ్యాయి. గడ్డకట్టిన జట్టును ఆమె వెనక్కి ముందుకు ఆడిస్తూఆ వెదర్‌లో ఎంజాయ్ చేసింది. ఆ వీడియోకు ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. "ఆర్కిటిక్ బ్లాస్ట్ వల్ల ప్రస్తుతం యురోప్ అంతటా వెదర్ శీతలంగా మారింది. బయటి వాతావరణం ఫ్రిజ్ తరహాలో ఉంది". బుధవారం స్వీడెన్ రికార్డు స్థాయిలో వెదర్ నమోదు అయ్యింది. 25 ఏళ్ల రికార్డును బ్రేక్ చేస్తూ ఆ రోజున మైనస్ 43.6 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదు కావడం విశేషం. స్వీడెన్‌లో 1999 తరువాత జనవరిలో అతి శీతల వెదర్ నమోదు కావడం ఇదే తొలిసారి. 1999లో మైనస్ 49 డిగ్రీలు నమోదు అయ్యింది.

Post a Comment

0Comments

Post a Comment (0)