పబ్ లో చిందులు వేసిన రోజా !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా ఈ ఏడాది న్యూయర్ సెలబ్రేషన్స్ ను బెంగుళూరులో జరుపుకుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి బెంగళూరులో న్యూ ఇయర్‌కు ఘనంగా స్వాగతం పలికింది. బెంగళూరు పబ్‌లో డ్యాన్సులు చేస్తూ  పాటలకు లయబద్దంగా స్టెప్పులు వేస్తూ నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.  ఈ వీడియోపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. రాష్ట్రంలో అంగన్‌వాడీలు, పారిశుధ్య కార్మికులు, రోడ్లపై నిరసనలు చేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ మంత్రికి ఇవేమి పట్టవా? బెంగళూరు పబ్బులో చిందులు వేస్తున్నావ్.. నువ్వు మంత్రివేనా ? అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే రోజా.. గతంలో మంత్రిగా ఉన్న భూమా అఖిల ప్రియా నంద్యాల ఉప ఎన్నికల్లో పంజాబీ డ్రెస్ వేసుకొని ప్రచారం చేయడంతో రోజా తీవ్రస్థాయిలో కామెంట్స్ చేసింది.. ఇప్పుడు ఆమెనే ఇలా డ్యాన్స్ చేస్తూ కనిపించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)