భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదం !

Telugu Lo Computer
0


క్యరాజ్యసమితితో పాటు దాని అనుబంధ సంస్థల్లో మార్పులు చేయాల్సిన సమయం వచ్చిందని ఎలాన్‌ మస్క్‌ అభిప్రాయపడ్డారు.  భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదమన్నారు. శక్తిమంతమైన దేశాలు తమ సభ్యత్వాన్ని వదులుకోలేక పోతున్నాయంటూ మాస్క్ విమర్శలు గుప్పించారు. అయితే, యూఎన్ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ఇటీవల ట్విటర్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేస్తూ భద్రతా మండలిలో ఏ ఒక్క ఆఫ్రికా దేశానికీ శాశ్వత సభ్యత్వం లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గత 80 ఏళ్ల కిందటిలా ఇప్పటికీ కొనసాగకూడదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన వ్యాపారి మైఖెల్ ఐసెస్ బర్డ్ ఈ పోస్ట్ కు సమాధానం ఇస్తూ మరి భారత్ సంగతి ఏంటి అని ప్రశ్నించారు. దీనికి ఎలాన్ మాస్క్ ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థలను సవరించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చాడు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వకపోవడం దారుణమన్నారు. శక్తిమంతమైన దేశాలు తమ స్థానాలను వదిలి పెట్టేందుకు ముందుకు రాకపోవడం వల్లే అసలు సమస్య వస్తుందన్నాడ. ఆఫ్రికా యూనియన్‌కు సమష్టిగా ఒక శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని ఎలాన్ మాస్క్ చెప్పుకొచ్చాడు. ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా 1945లో ఐక్యరాజ్యసమితి ఆవిర్భవించింది. దీనికి అనుబంధంగా భద్రతా మండలి ఏర్పడి ఏడున్నర దశాబ్దాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భద్రతా మండలిలో మాత్రం ఎలాంటి మార్పులూ జరగలేదు.. వీటో అధికారం కలిగిన శాశ్వత సభ్యదేశాలుగా అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్‌ దేశాలే కొనసాగుతున్నాయి. శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ ప్రయత్నిస్తున్నప్పటికి.. అందుకు అనుగుణంగా ఎలాంటి మార్పులు జరగడం లేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)