ఇన్సాట్-3DS శాటిలైట్ ప్రయోగానికి సిద్ధం !

Telugu Lo Computer
0


భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైంది. వాతావరణ ఉపగ్రహం INSAT-3DS ప్రయోగం కోసం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌కి తరలించారు. ఈ శాటిలైట్‌ని జియోసింక్రోనస్ లాంచ్ వెహికల్ ద్వారా ప్రయోగించనున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ కోసం బెంగళూరులోని యూఆర్  రావు శాటిలైట్ సెంటర్‌లో ఈ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసింది. వాతావరణ అంచనాలను, విపత్తు హెచ్చరికల కోసం మెరుగైన వాతావరణ పరిశీలనకు భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ కోసం ఈ ఉపగ్రహాన్ని రూపొందించినట్లు ఇస్రో ఒక ప్రకటన తెలిపింది. ఈ శాటిలైట్ లాంచ్ పిరియడ్ ఫిబ్రవరి 17- మార్చి 17 మధ్య ఉంది. అయితే, ఫిబ్రవరి మధ్యలో ప్రయోగం ఉండొచ్చని ఇస్రో అధికారులు తెలిపారు. ఇప్పటికే కక్ష్యలో INSAT-3D మరియు INSAT-3DR శాటిలైట్స్ ఉండగా.. వాతావరణ పరిశీలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు INSAT-3DS శాటిలైట్‌ని ప్రయోగించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)