స్నేహితురాలిని పెళ్లి చేసుకున్న మహిళ !

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అల్కా సోని అనే మహిళ కొంత కాలం తర్వాత తాను స్త్రీ కాదని గ్రహించింది. నాటి నుంచి మగాడిగా జీవించడం ప్రారంభించింది. 47వ పుట్టిన రోజున లింగ మార్పిడి సర్జరీ చేయించుకుంది. పురుషుడిగా మారిన ఆమె తన పేరును అస్తిత్వ సోనిగా మార్చుకుంది. చాలా కాలంగా స్నేహం చేస్తున్న స్నేహితురాలైన ఆస్తాను పెళ్లాడింది. ఫ్యామిలీ కోర్టులో జరిగిన ఈ ప్రత్యేక వివాహానికి ఇరువురి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అస్తిత్వ సోని పురుషుడిగా మారకముందు స్నేహితురాలైన ఆమె సోదరి ద్వారా తనకు పరిచయం ఏర్పడినట్లు ఆస్తా తెలిపింది. అనంతరం తమ మధ్య అనుబంధం ప్రేమగా మారినట్లు చెప్పింది. అల్కా సోని పురుషుడిగా మారిన తర్వాత ఇండోర్‌ కలెక్టర్‌ను కలిసి తమ పరిస్థితి వివరించి స్పెషల్‌ మ్యారేజ్‌కు దరఖాస్తు చేసినట్లు తెలిపింది. అనుమతి లభించడంతో ఇరు కుటుంబాల అంగీకారంతో స్పెషల్‌ మ్యారేజ్‌ యాక్ట్‌ ప్రకారం వివాహం చేసుకున్నట్లు చెప్పింది. సోమవారం తామిద్దరం హిందూ సంప్రదాయ పద్ధతిలో మరోసారి పెళ్లి చేసుకుంటామని వెల్లడించింది. మరోవైపు ట్రాన్స్‌జండర్‌ వ్యక్తుల వివాహాలకు సంబంధించి సుప్రీంకోర్టు అక్టోబర్‌లో కీలక తీర్పు ఇచ్చింది. వ్యక్తిగత చట్టాలతో సహా ఇప్పటికే ఉన్న చట్టాలను అనుసరించి నేరుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు వివాహం చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)