రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ శుభాకాంక్షలు !

Telugu Lo Computer
0


తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ''తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను.'' అంటూ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులకు మాజీ మంత్రి హరీష్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. హామీల అమలు దిశగా ప్రభుత్వం పనిచేయాలని ట్వీట్‌లో పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి విషెష్ అందించారు. తెలంగాణ రాష్ట్రం రేవంత్ నాయకత్వంలో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. టీడీపీ నేత నారా లోకేష్ కూడా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)