మిజోరం ముఖ్యమంత్రిగా లాల్దుహోమా !

Telugu Lo Computer
0


మిజోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (జెడ్‌పిఎం ) అధ్యక్షుడు లాల్దుహోమా మిజోరం ముఖ్యమంత్రిగా ఈనెల 8న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం రానున్న 100 రోజులకు సంబంధించి ప్రాధాన్య ప్రాజెక్టులను ప్రకటిస్తామని లాల్దుహోమా తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ  ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ఆర్థికపరిస్థితి చాలా దారుణంగా ఉందని అన్నారు. ఎంఎన్‌ఎఫ్‌ నుండి అధికారాన్ని స్వీకరించినప్పటికీ.. తమ నిబద్ధతను చూపుతామని చెప్పారు. తమది రైతు ప్రభుత్వమని, వారికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. కనీస మద్దతు ధర ప్రకటించామని చెప్పారు. ఎంపిక చేసిన నాలుగు వస్తువులైన అల్లం, పసుపు, మిర్చి, చీపురు కర్రలను మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని ప్రకటించారు. కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ.. ప్రజలకే ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. ఆర్థిక పునరుద్ధరణ కోసం నిపుణులతో వనరుల సమీకరణ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కమిటీ పొదుపు చర్యలు, పెట్టుబడి చర్యలు, మానవ వనరుల అంచనా తదితర అంశాలను పర్యవేక్షిసుందని అన్నారు. ఆ తర్వాత, అవినీతి నిరోధక చర్యలకు ప్రధాన ప్రాధాన్యతనిస్తామని ప్రకటించారు. అవినీతిని పారద్రోలడంతో కొత్త ప్రభుత్వాన్ని ప్రారంభిస్తామని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)