అక్రమంగా నిలువ ఉంచిన గ్యాస్‌ సిలిండర్‌లు !

Telugu Lo Computer
0


హారాష్ట్రలోని పుణె నగరంలోగల విమన్‌ నగర్‌ ఏరియాలో నిర్మాణంలో ఉన్న భవనంలో ఒక్కసారిగా భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల ధాటికి భవనం గోడలు ఎగిరిపోయాయి. ఈ హఠాత్పరిణామంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఫైరింజన్‌ల సాయంతో మంటలను ఆర్పేశారు. నిర్మాణంలోని భవనంలో అక్రమంగా నిలువ ఉంచిన గ్యాస్‌ సిలిండర్‌లే పేలుళ్లకు కారణమని నిర్ధారించారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నిర్మాణంలో ఉన్న భవనంలో దాదాపు 100 గ్యాస్‌ సిలిండర్‌లను అక్రమంగా నిలువ ఉంచారు. ఆ సిలిండర్‌లను నిలువ ఉంచిన గదిలో మంటలు చెలరేగడంతో 10 నుంచి 12 సిలిండర్‌లు పేలిపోయాయి. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదన్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉందని చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)