బజరంగ్‌ పునియాతో రాహుల్‌ గాంధీ కుస్తీ పట్టు !

Telugu Lo Computer
0


కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ 'కుస్తీ' పోటీల్లో పాల్గొన్నారు. ఒలింపిక్‌ పతక విజేత, టాప్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పునియాతో పోటీ పడ్డారు. ఈ సందర్భంగా 'కుస్తీ' పోటీల్లోని మెళకువలను రెజ్లర్లను అడిగి తెలుసుకున్నారు. రెజ్లర్ల రోజువారీ కార్యకలాపాలపై ఆరా తీశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రాహుల్‌ ప్రముఖ సామాజిక మాధ్యమం 'ఎక్స్‌' వేదికగా షేర్‌ చేశారు. కాగా, ఇటీవలే జరిగిన రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎన్నికపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రెజ్లర్లతో రాహుల్‌ బుధవారం భేటీ అయిన విషయం తెలిసిందే. హర్యానా లోని  ఝజ్జర్‌ జిల్లాకు చెందిన వీరేందర్‌ అఖాడాలో ప్రాక్టీస్‌లో ఉన్న రెజ్లర్లను కలిసి వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారితో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బజరంగ్ పునియా తమ సమస్యలను రాహుల్‌కు విన్నవించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)