రాత్రికి రాత్రి చెరువు మాయం ?

Telugu Lo Computer
0


బీహార్‌లోని దర్భంగాలో ప్రభుత్వ చెరువు రాత్రికి రాత్రే మాయమైంది. ల్యాండ్‌ మాఫియా గత కొన్ని రోజులుగా రాత్రివేళ గుట్టుగా ఇసుక, మట్టితో దీనిని పూడ్చివేశారు. చివరకు పూర్తిగా కనుమరుగైన చెరువు స్థానంలో ఒక గుడిసెను నిర్మించారు. కాగా, చెరువు పూర్తిగా మాయం కావడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో చెరువు చోరీ గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చెరువును పూడ్చి కబ్జా చేసింది ఎవరన్నది  ఆరా తీస్తున్నారు. బీహార్‌లో ఇప్పటికే ఇనుప వంతెన, తారు రోడ్డులో కొంత భాగం, టెలిఫోన్‌ టవర్‌ వంటివి చోరీ అయ్యాయి. ఇలాంటి అసాధారణ చోరీల సరసన తాజాగా చెరువు కూడా చేరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)