రామాలయానికి విరాళం పేరిట 'QR Code' మోసం !

Telugu Lo Computer
0


యోధ్యలో రామమందిర నిర్మాణ పనులను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ పర్యవేక్షిస్తోంది. విరాళాలు సేకరించేందుకు మాత్రం ఎవ్వరికీ అధికారం ఇవ్వలేదని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి వినోద్‌ బన్సల్‌ పేర్కొన్నారు. అయితే, సోషల్‌ మీడియాలో మాత్రం రామాలయం పేరుతో తప్పుడు పేజీలు సృష్టిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఆలయ ప్రారంభోత్సవం పేరు చెప్పి ప్రజలను లూటీ చేసేందుకు సైబర్‌ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. క్యూఆర్‌ కోడ్‌, ఫోన్‌ యూపీఐల ద్వారా ఆలయానికి విరాళాలు ఇవ్వాలని అడుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ తరహాలోనే ఓ మోసపూరిత పేజీని ఉదహరిస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇటువంటి విషయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదే విషయంపై ఉత్తర్‌ప్రదేశ్‌, ఢిల్లీ పోలీసులతోపాటు కేంద్ర హోంశాఖకు ఇటీవల లేఖ రాశామని వీహెచ్‌పీ ప్రతినిధి వినోద్‌ బన్సల్‌ పేర్కొన్నారు. ప్రజలు ఇటువంటి మోసాలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇందుకు సంబంధించి ఓ వీడియో సందేశం విడుదల చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)