కశ్మీర్ విద్యార్థులతో మోడీ ముచ్చట్లు !

Telugu Lo Computer
0


'వతన్ కో జానో ' (దేశం గురించి తెలుసుకో) అనే విశిష్ట కార్యక్రమం పరిధిలో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం విద్యార్థులతో ముచ్చటించారు. జమ్మూ కశ్మీర్‌లోని ప్రతి జిల్లాకు చెందిన దాదాపు 250 మంది విద్యార్థులతో ప్రధాని మాట్లాడారు. ఈ కశ్మీరీ విద్యార్థులు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ దేశంలోని మారుమూల ప్రాంతాల గురించి తెలుసుకోవడం, చారిత్రక జ్ఞానాన్ని పెంపొందింపచేసుకోవడం ఈ విద్యార్థుల యాత్ర లక్షం. సమాజంలోని అట్టడుగు స్థాయికి చెందిన విద్యార్థులు వీరని అధికార వర్గాలు తెలిపాయి. జమ్మూ కశ్మీర్ నుంచి ఈ విద్యార్థుల బృందం జైపూర్, అజ్మీర్, ఢిల్లీ ప్రాంతాలలో పర్యటించారు. జమ్మూ కశ్మీర్ విద్యార్థులకు , యువతకు ఇతర ప్రాంతాల తీరుతెన్నుల గురించి తెలియచేయడమే వతన్ కో జానో కార్యక్రమం ఉద్ధేశమని అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)