చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ పెంపు !

Telugu Lo Computer
0


చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను కేంద్ర ప్రభుత్వం సవరించింది. సుకన్య సమృద్ధి యోజన, మూడేళ్ల కాలవ్యవధి కలిగిన పోస్టాఫీసు టైమ్‌ డిపాజిట్‌ పై వడ్డీ రేట్లను పెంచింది. మిగిలిన పథకాలపై వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. సుకన్య సమృద్ధి యోజనపై ప్రస్తుతం 8 శాతం వడ్డీ ఇస్తుండగా.. దాన్ని 20 బేసిస్‌ పాయింట్లు పెంచి 8.2 శాతానికి చేర్చారు. మూడేళ్ల టైమ్‌ డిపాజిట్‌పై 7 శాతంగా ఉన్న వడ్డీని 7.1 శాతానికి పెంచారు. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రతి త్రైమాసికానికోకసారి కేంద్రం వడ్డీ సవరిస్తుంటుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 వరకు ఈ వడ్డీ రేట్లు వర్తించనున్నాయి. పీపీఎఫ్‌లో మదుపు చేసే వారికి మాత్రం మరోసారి నిరాశే ఎదురైంది. రికరింగ్‌ డిపాజిట్‌, సీనియర్‌ సిటిజన్‌ స్కీమ్‌, మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌, కిసాన్‌ వికాస్‌ పత్ర వడ్డీ రేట్లు మాత్రం యథాతథంగా కొనసాగుతాయి. తాజా వడ్డీ రేట్ల వివరాలను పట్టికలో పరిశీలించొచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)