గాలులకు ఊగిపోతూ ల్యాండైన విమానం !

Telugu Lo Computer
0


ఇంగ్లాండ్ ను గెరిట్‌ తుపాను వణికిస్తోంది. తుపాను ప్రభావంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈదురుగాలుల ప్రభావంతో ఇటీవల ఓ విమానం ఊగిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లాస్‌ఏంజెల్స్‌ నుంచి వచ్చిన అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ బోయింగ్‌ 777 విమానం.. లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్ట్‌లో అత్యంత ప్రమాదర పరిస్థితుల్లో దిగింది. డిసెంబరు 27న ఈ ఘటన చోటుచేసుకుంది. రన్‌వేపై విమానం ల్యాండ్‌ అవుతుండగా ఒక్కసారిగా ఈదురుగాలులు వీచాయి. విమానం విపరీతంగా ఊగిపోయి.. ఒకవైపు ఒరిగి దాదాపు నేలను తాకబోయింది. దాంతో అందులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. దాదాపు 10 సెకన్ల పాటు కుదుపులకు గురైన విమానం చివరకు సురక్షితంగా రన్‌వేపై దిగింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)