ఇమ్రాన్‌ ఖాన్‌ నామినేషన్‌ తిరస్కరణ !

Telugu Lo Computer
0


పాకిస్తాన్‌ మాజీ ప్రధాని, పాకిస్తాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ చీఫ్‌ ఇమ్రాన్‌ఖాన్‌ ఆ దేశ ఎ‍న్నికల సంఘం షాక్‌ ఇచ్చింది. 2024లో జరగబోయే పాకిస్తాన్‌ సాధారణ ఎన్నికల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించింది. ఈ మేరకు ఆయన నామినేషన్‌ పాకిస్తాన్‌ ఎన్నికల సంఘం తిరస్కరించిందని ఆ పార్టీ ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు. అయితే ఇమ్రాన్‌ ఖాన్‌ స్వస్థలమైన మియాన్వాలి నుంచి ఆయన పోటీ చేయడానికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.​ ఇక ఆయన అధికార రహస్యపత్రాల దుర్వినియోగం కేసులో ఆగస్టు నుంచి రావల్పిండిలోని అడియాల జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆయన న్యాయస్థానంలో దోషిగా నిర్ధారించబడినందుకే నామినేషన్‌ను తిరస్కరించామని ఎన్నికల సంఘం పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)