బెలోచిస్థాన్ ఎన్‌కౌంటర్‌లో ఐదుగరు ఉగ్రవాదులు హతం !

Telugu Lo Computer
0


పాకిస్థాన్ లోని కల్లోలిత బెలోచిస్థాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందారని ఆర్మీ ఆదివారం వెల్లడించింది శని, ఆదివారాల్లో అందిన సమాచారం మేరకు రాత్రి నిఘా ఆధార ఆపరేషన్ నిర్వహించగా, సైనిక దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురెదురు కాల్పులు జరిగాయని ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ వివరించింది.ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసి ఆయుధాలను, మందుగుండు, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. బెలూచిస్థాన్, ఖైబర్ ఫంక్తు ప్రాంతాల్లో ఇటీవల ఉగ్రవాదుల దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నెల మొదట్లో ఒకే రోజులో రెండు వేర్వేరు సంఘటనల్లో 25 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

Post a Comment

0Comments

Post a Comment (0)