సుదీర్ఘ పోరాటానికి సిద్ధమవుతున్నాం !

Telugu Lo Computer
0


మ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 రద్దు సక్రమమేనని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బిజెపి నేతలు హర్షం వ్యక్తం చేస్తుండగా కశ్మీర్‌కు చెందిన నేతలు మాత్రం సుప్రీంకోర్టు తీర్పు తమకు తీవ్ర నిరాశను కలిగించిందని పేర్కొన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు , రాష్ట మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సుప్రీంకోర్టు తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 'తీర్పుతో అసంతృప్తితో ఉన్నాం. కానీ నిరాశపడడం లేదు. ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి బిజెపికి కొన్ని దశాబ్దాలు పట్టింది. మేం కూడా సుదీర్ఘ పోరాటానికి సిద్ధమవుతున్నాం. దీనిపై మా పోరాటం కొనసాగుతుంది' అని ఒమర్ అబ్దుల్లా ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆశను కోల్పోరాదని పేర్కొంటూ ప్రముఖ కవి ఫౌజ్ అహ్మద్ ఫౌజ్ రాసిన ఓ కవితను కూడా ఆయన ఉదహరించారు.

సుప్రీంకోర్టు తీర్పుతో తాము నిరుత్సాహ పడడం లేదని మరో మాజీ ముఖ్యమంత్రి, పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు.' సుప్రీంకోర్టు తీర్పుకు మేము నిరుత్సాహ పడడం లేదు.ఈ విషయంలో జమ్మూ కశ్మీర్ ఎన్నో ఒడిదుడుకులను చూసింది. 370 నిబంధన తాత్కాలికమన్న వ్యాఖ్యలతో మేము ఓడిపోయినట్లు కాదు. ఇది భారత దేశ ఆలోచనల ఓటమి.ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ జైలులా మారింది. దుకాణాలు ఉదయం 10 గంటల వరకు తెరవొద్దని ఆదేశించారు. మేమంతా గృహనిర్బంధంలో ఉన్నాం. ఏళ్లనుంచి కొనసాగుతున్న యుద్ధమిది. మేము ఇక్కడినుంచి వెళ్లం. మేమంతా కలిసి పోరాడుతాం' అని ఎక్స్‌లో పోస్టు చేసిన ఓ వీడియయోలో మెహబూబా ముఫ్తీ అన్నారు. కాగా సుప్రీంకోర్టు చాలా విచారకరం, దురదృష్టకరమైనదని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూడా అయిన గులాం నబీ ఆజాద్ అన్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించాల్సిందేననిఆయన అన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై జమ్మూ కశ్మీర్‌లోని రాజకీయ పార్టీలను సంప్రదించి ఉంటే తాము ఎంతో కొంత బేరమాడి ఉండే వాళ్లమని అలా చేయకుండా హడావేడిగా దీన్ని రద్దు చేశారని ఆయన అభిప్రాయపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)