ఉగ్రవాదంపై సమాచారం ఇస్తే భారీ నజరానా

Telugu Lo Computer
0


మ్మూ కాశ్మీర్ పోలీసులు ఉగ్రవాదులు, డ్రగ్స్ సరఫరాపై సమాచారం అందిస్తే భారీ నజరానా ఇస్తామని ప్రకటించారు. వీటిపై స్పష్టమైన సమాచారం అందించే వ్యక్తులకు రూ.1 లక్ష నుంచి రూ.12.5 లక్షల వరకు నగదు రివార్డులు ఇవ్వనున్నట్లు ఆదివారం పోలీసులు ప్రకటించారు. ఉగ్రవాదులు, ఆయుధాలు, నిషేధిత పదార్థాల రవాణా చేయడానికి దేశవ్యతిరేక శక్తులు ఉపయోగించే సరిహద్దుల్లోని సొరంగాల జాడ చెప్పిన వారికి రూ. 5 లక్షల రివార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా రవాణా చేసే సరుకుల ఆచూకీ చెబితే రూ. 3 లక్షలు ఇస్తామని చెప్పారు. పాకిస్తాన్ టెర్రరిస్టులకు సాయం చేసే వ్యక్తులు, హ్యాండర్ల వివరాలతో పాటు ఉగ్రవాదులతో సంబంధం ఉన్న వారి వివరాలను చెప్పినట్లైతే రూ. 2 లక్షలు ఇవ్వనున్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రకటించారు. వీటితో పాటు డ్యూటీలో లేని పోలీసుల వివరాలు ఉగ్రవాదులకు అందించే వ్యక్తుల సమాచారం ఇస్తే రివార్డు ఇస్తామని చెప్పారు. మసీదులు, మదర్సాలు, పాఠశాలలు, కళాశాలల్లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించే వ్యక్తుల సమాచారం కోసం రూ. లక్ష ఇస్తామని పోలీసులు తెలిపారు. ఉగ్రవాది స్థాయిని బట్టి రూ. 2 లక్షల నుంచి రూ.12.50 లక్షల వరకు రివార్డ్ ప్రకటించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)