ఉత్తరాఖండ్‌లో త్వరలో ఉమ్మడి పౌరస్మృతి అమలు

Telugu Lo Computer
0


త్తరాఖండ్‌లో త్వరలో ఉమ్మడి పౌర స్మృతి అమలవుతుందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ థామి వెల్లడించారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన బిల్లును త్వరలో అసెంబ్లీలో ప్రవేశ పెడతామని తెలియజేశారు. బృందావన్‌లో వాత్సల్య గ్రామంలో శనివారం సాధ్వీరీతాంభర షష్టి పూర్తి మహోత్సవం నిర్వహించిన సందర్భంగా ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ థామి ఈ ప్రకటన చేశారు. రామభక్తులపై కాల్పులకు బాధ్యులైన వారు అయోధ్యలో ఎప్పటికీ రామాలయాన్ని నిర్మించలేరని ప్రతిపక్షాలను దృష్టిలో పెట్టుకుని ధ్వజమెత్తారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్గించే 370ఆర్టికల్, ట్రిపుల్ తలాక్ రద్దు, ఇవన్నీ ప్రస్తావించారు. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలన్న లక్షం జనవరి 22 న ప్రతిష్ఠాపన దినోత్సవానికి ప్రధాని నరేంద్రమోడీ పాల్గొనబోవడం ద్వారా నెరవేరబోతోందని పేర్కొన్నారు. సాధ్వీ రీతాంభర గురించి ప్రస్తావిస్తూ రామజన్మభూమి ఉద్యమం సందర్భంగా ఆమె ఉపన్యాసాల ద్వారా తాను స్ఫూర్తి పొందానని, ఆమె దీవెనలు, వాత్సల్యం ప్రజలకు సేవ చేయడం వైపు నడిపించాయని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)