థైరాయిడ్‌ - ఆహార నియమాలు !

Telugu Lo Computer
0

థైరాయిడ్ వ్యాధి బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పు కారణంగా థైరాయిడ్‌ సమస్య పెరుగుతోంది. థైరాయిడ్ గ్రంథి పనితీరులో తలెత్తే సమస్య కారణంగా ఈ సమస్య వస్తుంది. అయితే థైరాయిడ్‌తో బాధపడే వారు అన్నం తినాలా వద్దా అన్న అనుమానం ఉంటుంది. సాధారణంగా అన్నం తినడం వల్ల క్యాలరీలు పెరగడంతో పాటు, షుగర్‌ స్థాయిలు పెరుగుతాయని చెబుతుంటారు. అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం  థైరాయిడ్ వ్యాధిగ్రస్తులు అన్నం అస్సలు తినకూడదు. థైరాయిడ్‌ సమస్యతో బాధపడేవారు వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్ తినాలి. బియ్యంలో ఉండే గ్లూటెన్‌ ప్రోటీన్‌ థైరాయిడ్‌కు హానికరం. గ్లూటెన్ అనేది శరీరంలో ఉండే యాంటీబాడీలను తగ్గించే ప్రోటీన్, ఇది థైరాక్సిన్ హార్మోన్‌తో సమస్యలను కలిగిస్తుంది. బియ్యంలో కార్బోహైడ్రేట్లు, కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. అన్నం తినడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్, థైరాయిడ్ అలాగే టైప్ 2 డయాబెటిస్, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అన్నం ఎక్కువగా తినడం వల్ల థైరాయిడ్ వ్యాధితో బాధపడేవారు బరువు పెరిగే అవకాశం ఉంటుంది. బియ్యంతో పోలిస్తే రోటీలో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ ఖనిజాలన్నీ బియ్యంలో తక్కువ పరిమాణంలో ఉంటాయి. రోటీలో బియ్యం కంటే సూక్ష్మపోషకాలు, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అన్నం తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ థైరాయిడ్‌ రోగులు అన్నం తీసుకోవాలనుకుంటే మాత్రం తక్కువ అన్నంలో ఎక్కువ కూరను కలుపుకొని తీసుకోవాలి. ముఖ్యంగా కూరగాయలు, ఆకు కూరలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి పెద్ద మొత్తంలో ప్రోటీన్‌ అందుతుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)