తగ్గిన బంగారం ధర !

Telugu Lo Computer
0


మెరికన్  డాలర్‌ మళ్లీ బలం పుంజుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,038 డాలర్ల వద్ద ఉండగా  దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ధర. 600, స్వచ్ఛమైన పసిడి ధర రూ.650, 18 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.500 చొప్పున తగ్గాయి. వెండి రేటులో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500, 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,730 గా నమోదయ్యాయి. 18 క్యారెట్ల బంగారం ధర రూ.47,040 ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.82,200గా ఉంది.  చెన్నైలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 58,650 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,980 కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు వరుసగా రూ.57, 500, రూ. 62,730గా ఉన్నాయి. ఢిల్లీలో ఈ ధరలు రూ.58,260, రూ.63,540 గా ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)