పెరిగిన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు !

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరిగాయి. నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ తెల్లవారు జామున బుక్ చేసుకునే తొలి సిలిండర్‌కు కొత్త రేట్లను వర్తింపజేస్తూ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ అయిదు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గురువారం నాడే ముగిశాయి. ఆ మరుసటి రోజే ఎల్పీజీ సిలిండర్ల రేట్లను కేంద్రం పెంచింది. తాజా పెంపు వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ఎల్పీజీ సిలిండర్లకు వర్తిస్తుంది. 19 కేజీల ఒక్కో సిలిండర్ మీద 21 రూపాయలు పెరిగింది. నేటి నుంచి బుక్ చేసుకునే ప్రతి కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌పైనా 21 రూపాయలను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది వినియోగదారుడికి. గృహావసర సిలిండర్ల రేట్లల్లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పూ చేయలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)