పంజాబ్‌, తమిళనాడు గవర్నర్లపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం !

Telugu Lo Computer
0


మిళనాడు పంజాబ్‌ గవర్నర్‌లపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరును సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. బిల్లులను ఆమోదించడంలో గవర్నర్లు చేస్తున్న జాప్యంపై పంజాబ్‌, తమిళనాడు ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషిన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రజలు ఎన్నుకున్న నేతలు ద్వారా అసెంబ్లీలో ఆమెదం పొందిన బిల్లుల విషయంలో ఆలస్యం చేయవద్దని ఇరు రాష్ట్రాల గవర్నర్‌లకు సున్నితంగా హెచ్చరించింది. బిల్లులపై గవర్నర్ల చర్య తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. 'మీరు నిప్పుతో ఆడుకుంటున్నారు. సమావేశాలు సక్రమంగా జరగలేదన్న కారణంతో అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు చెల్లవని గవర్నర్‌ ఎలా చెబుతారు. పంజాబ్‌లో గవర్నర్‌, సర్కార్‌కు మధ్య జరుగుతున్న పరిణామాలపై మేము సంతృప్తికరంగా లేము. ఇలాంటి చర్యల వల్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్యన్ని కొనసాగిస్తామా?. ఇది చాలా తీవ్రమైన విషయం' అని ధర్మాసనం స్పష్టం చేసింది. స్థిరపడిన సంప్రదాయాలపై భారత్‌ నడుస్తోందని, వాటిని అనుసరించాల్సిన అవరసం ఉందని నొక్కి చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)