లో బీపీతో వచ్చే అనర్ధాలు - జాగ్రత్తలు !

Telugu Lo Computer
0


కస్మాత్తుగా పైకి లేచినప్పుడు లేదా ఎప్పుడైనా పగటిపూట తల తిరిగినట్లు, మైకంగా అనిపించిందా? ఇవి లో బ్లడ్‌ ప్రెజర్‌ (లో బీపీ)కి సంకేతాలు కావచ్చు. ధమనుల ద్వారా రక్త ప్రసరణ శక్తి తగ్గినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఆహారపు అలవాట్లు, డీహైడ్రేషన్‌, ఇన్ఫెక్షన్, బ్లడ్‌ లాస్‌, గుండె సమస్యలు, ఎండోక్రైన్ డిజార్డర్స్‌, అలెర్జిక్‌ రియాక్షన్ల వల్ల లో బీపీ రావచ్చు. బ్లడ్ ప్రెజర్‌ రీడింగ్ 90/60 mm Hg కంటే తక్కువగా ఉంటే లో బీపీ లేదా హైపోటెన్షన్ ఉన్నట్లు భావించాలి. హై బీపీ వలె ఆందోళనకరంగా లేనప్పటికీ, హైపోటెన్షన్ కూడా తీవ్ర లక్షణాలు, సమస్యలకు దారి తీస్తుంది. రక్తప్రసరణ తగ్గడం వల్ల లో బీపీతో చర్మం చల్లగా, తేమగా ఉంటుంది. చేతులు, కాళ్లు తాకితే చాలా చల్లగా అనిపించవచ్చు, చర్మం లేతగా కనిపించవచ్చు. మెదడుకు తగినంత రక్తం లభించనప్పుడు మూర్ఛ వస్తుంది, తాత్కాలికంగా స్పృహ కోల్పోయేలా చేస్తుంది. ముఖ్యంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా యంత్రాలను ఆపరేట్ చేస్తున్నప్పుడు మూర్ఛపోవడం ప్రమాదకరం. హైపోటెన్షన్ శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. వేగంగా, తక్కువ మొత్తంలో గాలి పీల్చుకుంటారు. శరీరం లో బీపీని భర్తీ చేయడానికి, ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరచడానికి శ్వాస రేటును పెంచుతుంది. కండరాలు, అవయవాలకు రక్త ప్రసరణ తగ్గడం వల్ల లో బీపీ అలసట, బలహీనతను కలిగిస్తుంది. శక్తి లేకపోవడం, రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడంలో ఇబ్బందులు ఏర్పడుతాయి. నిల్చున్నప్పుడు తలతిరగడం లేదా మైకంగా అనిపించడం లో బీపీకి సాధారణ సంకేతం. త్వరగా మెదడు తగినంత రక్తాన్ని అందుకోనప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇది తాత్కాలిక బలహీనతకు దారితీస్తుంది.

మెదడుకు తగినంత రక్త ప్రసరణ లేకపోవడం కాగ్నిటివ్‌ ఫంక్షన్లు దెబ్బ తింటాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది జీవన నాణ్యతను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. తీవ్రమైన లో బీపీ, షాక్‌కి దారి తీస్తుంది. ఈ పరిస్థితిలో శరీరం సరిగ్గా పనిచేయడానికి తగినంత రక్తం అందదు. ఆర్గాన్‌ డ్యామేజ్‌ లేదా ప్రాణాంతక సమస్యలకు దారితీయవచ్చు. లో బీపీ వల్ల గుండె, మూత్రపిండాలు, మెదడు వంటి ముఖ్యమైన అవయవాలకు తగినంత రక్తం సరఫరా కాదు. ఇలా దీర్ఘకాలం కొనసాగితే అవయవ నష్టం జరుగుతుంది లేదా సక్రమంగా పని చేయవు. లో బీపీతో మైకం, మూర్చపోవడం వల్ల గాయాల పాలయ్యే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. హైపోటెన్షన్ ఉన్న వ్యక్తులు ప్రమాదాలను నివారించడానికి పొజిషన్స్‌ ఛేంజ్‌ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లో బీపీ శస్త్రచికిత్సలు లేదా చికిత్స తీసుకునే సమయంలో సవాళ్లను కలిగిస్తుంది. అధిక రక్తస్రావం లేదా కణాలకు తగినంత ఆక్సిజన్‌ అందకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. లో బీపిని మేనేజ్‌ చేయడానికి అంతర్లీన కారణాలను గుర్తించడం, పరిష్కరించడం చాలా ముఖ్యం. 

జాగ్రత్తలు : రక్తపోటును క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి, ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించాలి. లో బీపీ అంతర్లీన మెడికల్‌ కండిషన్‌ కారణంగా ఉంటే, సమస్యను దూరం చేయడానికి చికిత్స తీసుకోవడం చాలా అవసరం. బ్లడ్‌ వ్యాల్యూమ్‌ పెంచడానికి లేదా రక్త నాళాలను కుదించడానికి వైద్యులు ఫ్లూడ్రోకార్టిసోన్ లేదా మిడోడ్రైన్ వంటి మందులను సూచించవచ్చు. లిక్విడ్స్‌, సాల్ట్‌ ఎక్కువగా తీసుకోవాలి. కంప్రెషన్ మేజోళ్ళు ధరించాలి, ఎక్కువసేపు నిలబడకుండా ఉండటం వల్ల బ్లడ్‌ ప్రెజర్‌ పెరుగుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)