వివాదాస్పదమైన సచిన్ విగ్రహం !

Telugu Lo Computer
0


ముంబైలోని వాంఖడే స్టేడియంలో రెండు రోజుల క్రితం సచిన్ టెండూల్కర్ విగ్రహావిష్కరణ ఆయన చేతుల మీదుగానే జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్, బీసీసీఐ కార్యదర్శి జే షా, సచిన్ కుటుంబ సభ్యులు, వందలాది మంది క్రికెట్ అభిమానులు విగ్రహ ఆవిష్కరణకు హాజరయ్యారు.ఇంత ఘనంగా జరిగిన సచిన్ విగ్రహావిష్కరణ చివరకు పెద్ద ఎత్తున వివాదాస్పదమవుతోంది. విగ్రహం సచిన్‌ది కాదంటూ ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ విగ్రహం పెట్టారని విపరీతమైన ట్రోల్స్, వివాదస్పద వ్యాఖ్యలు చక్కర్లు కొడుతున్నాయి. సచిన్ పేరు చెప్పి ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ విగ్రహం పెట్టారంటూ తీవ్రంగా అభిమానులు ఆరోపిస్తున్నారు. వీరి మాటల్లో వాస్తవం లేకపోలేదు. విగ్రహాన్ని కాస్త పరిశీలించి చూస్తే అచ్చం స్టేప్ స్మిత్ ముఖాన్ని పోలినట్లుగా ఉంటుంది. ఈ విగ్రహాన్ని ఇద్దరి ముఖ కవలికలతో పోలుస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఎన్నో రికార్డులను తన సొంతం చేసుకున్నారు. కోట్లాదిమంది అభిమానులను సైతం తనవైపే చూసేలా మైదానంలోకి దిగి ప్రత్యర్థులకు చుక్కలు చూపించేవారు. అలాంటి మాస్టర్ బ్లాస్టర్ విగ్రహాన్ని ఆవిష్కరించేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలంటూ అంటూ అభిమానులు మండిపడుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)