శివరాజ్ కుమార్ ఆసుపత్రిలో చేరిక

Telugu Lo Computer
0


న్నడ నటుడు శివరాజ్ కుమార్ గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలో బాధపడుతున్నారు. జ్వరం ఎక్కువగా రావడంతో శుక్రవారం బెంగళూరులోని ఆసుపత్రిలో చేరారు. బెంగళూరులోని వైదేహి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శివరాజ్ కుమార్ కు పెద్దగా ఇబ్బంది ఏమీ లేదని, ఆయన కోలుకుంటున్నారని ఆయన కుటుంబ వర్గాలు తెలిపాయి. నటుడు శివరాజ్‌కుమార్‌ శుక్రవారం మధ్యాహ్నం ఆస్పత్రిలో చేరారు, సాయంత్రం జనరల్‌ చెకప్‌ పూర్తయ్యింది, విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో ప్రస్తుతం ఆయన ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం. 61 ఏళ్ల వయసులో కూడా యువకుడిలా కనిపించే హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్ చేతిలో పదుల సంఖ్యలో చిత్రాలు ఉన్నాయి. తమిళం, తెలుగు భాషల్లో శివరాజ్ కుమార్ కు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. శివరాజ్ కుమార్ హీరోగా నటించిన గోస్ట్ సినిమా ఇటీవలే విడుదల అయ్యి సూపర్ హిట్టయింది. నటుడు శివరాజ్ కుమార్ ఆరోగ్యంగా ఉన్నారని, అభిమానులు భయపడాల్సిన అవసరం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. శివరాజ్ కుమార్ ప్రస్తుతం చాలా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. సినిమాలతో పాటు టీవీ షోస్‌లో కూడా శివరాజ్ కుమార్ పాల్గొంటు చాలా బిజీగా ఉన్నారు. ఇటీవల కాలంలో హీరో శివరాజ్ కుమార్ ఆరోగ్యంలో తేడా కనిపించిందని ఆయన సన్నిహితులు అంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)