టపాసులు పేల్చడంతో ఆందోళన స్థాయిలో కాలుష్యం !

Telugu Lo Computer
0


ఢిల్లీ దాని సమీప నగరాల్లో కాలుష్యం సోమవారం ఉదయం మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీపావళి సందర్భంగా ప్రజలు టపాసులు పేల్చడంతో కాలుష్యం, పొగ కమ్మేశాయి. ఉదయం 6.00 గంటల సమయంలో ఢిల్లీ వాయు నాణ్యతా ప్రమాణం (ఎక్యూఐ) 500 కంటే అధికంగా ఉంది. కొన్ని ప్రదేశాల్లో 900 కి చేరుకుంది. జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఎక్యూఐ 910, కరోల్‌బాగ్‌ 779గా నమోదయ్యాయి. గతవారం కురిసిన వర్షాలు కాలుష్యం నుండి కొంతమేర ఉపశమనం కలిగించినప్పటికీ.. బాణా సంచాతో గాలి నాణ్యతా మళ్లీ క్షీణించింది. పలు ప్రాంతాల్లో విషపూరిత పొగమంచుకమ్మేయడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. రోహణీ, ఐటిఒ మరియు ఢిల్లీ విమానాశ్రయ ప్రాంతంతో సహా పగటి పూట చాలా ప్రదేశాలలో పిఎం 2.5 మరియు పిఎం 10 కాలుష్య స్థాయిలు 500కి చేరుకున్నాయని సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ (సిపిసిబి) ప్రకటించింది.


Post a Comment

0Comments

Post a Comment (0)