ప్రజల మద్దతుతో నీట్' నుంచి మినహాయింపు సాధిస్తాం !

Telugu Lo Computer
0


ఎంబీబీఎస్ సహా ఇతర వైద్య డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న 'నీట్ -యూజీ'పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. 'నీట్'తో తమిళనాడుపై భారం మోపారని ఆరోపించారు. దీంతో తమ రాష్ట్రంలోని వైద్య, మౌలిక వసతులను నాశనం చేశారన్నారు. ప్రజల మద్దతుతో 'నీట్' నుంచి తమ రాష్ట్రానికి మినహాయింపు లభిస్తుందని ఆదివారం జరిగిన 'డాక్టర్స్ అసోసియేషన్ ఫర్ ఈక్వాలిటీ' నాలుగో రాష్ట్ర మహాసభలో వర్చువల్‌గా మాట్లాడుతూ చెప్పారు. ఈ సందర్భంగా ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ 'నీట్ మినహాయింపు కోసం న్యాయ పోరాటం జరుగుతున్నది. కొందరు అహంకారంతో.. మరి కొందరు పదవుల్లో ఉండటంతో నీట్ మినహాయింపు సాధ్యం కాదని చెప్పొచ్చు. కానీ. నీట్ నుంచి మినహాయింపు పొందడమే మన లక్ష్యం. రాష్ట్ర ప్రజలందరి మద్దతుతో ఇది జరుగుతుంది` అని చెప్పారు. నీట్ పరీక్ష నిర్వహణకు వ్యతిరేకంగా డీఎంకే యువజన, విద్యార్థి, వైద్య విభాగాలు చేపట్టిన సంతకాల సేకరణ ప్రక్రియ ప్రజా ఉద్యమ రూపం దాల్చిందని ఎంకే స్టాలిన్ తెలిపారు. ఇప్పటికే తమిళనాడుకు 'నీట్' మినహాయింపు ఇవ్వాలని పలు దఫాలు కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించిన సంగతి గుర్తు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)