టమాటాలు - అనారోగ్య సమస్యలు !

Telugu Lo Computer
0


మాటాల్లో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. టమాటాలను తీసుకోవడం వల్ల పలు రకాల సమస్యల నుంచి దూరం కావచ్చు. కానీ అతిగా తీసుకోవడం వల్ల మాత్రం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. టమాటాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారు టమాటాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. వీటికి ఎక్కువగా తీసుకుంటే మాత్రం కీళ్ల నొప్పులు ఎక్కువ అవుతాయి. అంతే కాకుండా కీళ్లల్లో మంట, నొప్పిని కలిగిస్తూ ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధ పడేవారు టమాటాలను తీసుకోకపోవడమే మంచిది. టమాటాల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకుంటే మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. గ్యాస్, ఎసిడిటి సమస్యలతో ఇబ్బంది పడేవారు సైతం టమాటాలకు దూరంగా ఉండాలి. అలాగే వీటిని ఎక్కువగా తీసుకున్నా.. గుండెల్లో మంట, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. అలర్జీ సమస్యలు, గొంతులో ఇన్ ఫెక్షన్స్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా టమాటాలను ఎక్కువగా తినడం వల్ల నోరు, నాలుక, ముఖంలో వాపు సమస్యలు వస్తాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)