పింఛను లబ్ధిదారులు సచివాలయానికి రాకుండా ఏర్పాట్లు ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో పింఛను కోసం లబ్ధిదారులు సచివాలయాలకు రాకుండా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మే ఒకటో తేదీన బ్యాంకు ఖాతాల్లో పింఛను డబ్బు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి.. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో స్పష్టం చేశారు. బ్యాంకు ఖాతాలు లేని వారికి, దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మే ఒకటో తేదీ నుంచి 5వ తేదీలోపు ఇంటి వద్దే పింఛను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పింఛన్ల పంపిణీ విధివిధానాల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)