రాజస్థాన్ ఆరోగ్యబీమా పథకం ఆదర్శనీయం !

Telugu Lo Computer
0


రాజస్థాన్ ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న "చిరంజీవి ఆరోగ్యబీమా" పథకం ఎంతో ఆదర్శనీయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం ప్రశంసించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తాము కేంద్రం లో అధికారం లోకి వస్తే అలాంటి ఆరోగ్యబీమా పథకాన్ని అమలు చేస్తామన్నారు. వాయనాడ్ లోని సుల్తాన్ బతేరీలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో కొత్త బ్లాక్‌ను ఆయన ప్రారంభించారు. వైద్యపరంగా విషాదాలకు పేదలే తరచుగా బాధితులవుతుంటారని, అందువల్ల జాతీయస్థాయిలో ఆరోగ్యభద్రత పునర్వవస్థీకరించాల్సిన అవసరం ఉందని రాహుల్ సూచించారు. తాము అధికారం లోకి వస్తే దేశ వ్యాప్తంగా ఇలాంటి పథకాలను అమలు చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. రాజస్థాన్‌లో తాము మళ్లీ గెలిస్తే చిరంజీవి ఆరోగ్యబీమా పథకం పరిధిని రూ 50 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)