కేసుల వాయిదాపై సీజేఐ డీవై చంద్రచూడ్ ఆందోళన !

Telugu Lo Computer
0

సుప్రీంకోర్టులో కేసులు వాయిదా పడుతున్న తీరుపై సీజేఐ డీవై చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌, అక్టోబర్‌లో 3688 కేసులు వాయిదాపడినట్లు తెలిపారు. వాయిదాల మీద వాయిదాలు వేయడం కరెక్టు కాదన్నారు. ఇవాళ ఒక్క రోజే 178 కేసుల్ని విచారణ నుంచి వాయిదా వేయాలని కోరారని, ఇది న్యాయ వ్యవస్థపై ప్రభావం చూపుతుందన్నారు. కోర్టులంటే వాయిదాలే అన్న విధానాన్ని తీసుకురావద్దు అని సీజే చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేగంగా కేసుల్ని పరిష్కరించాలన్న ప్రక్రియకు ఇది విఘాతంగా మారుతుందన్నారు. బాలీవుడ్ చిత్రం దామినిలో సన్నీ డియోల్ కొట్టిన డైలాగ్‌ను.. ఇవాళ సీజేఐ ఓ కేసు విచారణ సమయంలో రిపీట్ చేశారు. ఆ ఫిల్మ్‌లో అత్యాచార బాధితురాలి తరపున వాదిస్తూ కేసును వాయిదా వేస్తున్న సమయంలో తారీక్ పే తారకీ అంటూ హీరో డైలాగ్ కొడుతారు. అయితే ఇవాళ ఓ కేసు విచారణ సమయంలో సీజే చంద్రచూడ్ కూడా ఆ డైలాగే కొట్టారు. పదేపదే కేసుల్ని వాయిదా వేయడం సరికాదన్నారు. దీని వల్ల వేగంగా కేసుల్ని పరిష్కరించాలన్న తమ లక్ష్యం నిర్వీర్యం అవుతుందన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)