బీఆర్ఎస్‌లోకి కాసాని జ్ఞానేశ్వర్ !

Telugu Lo Computer
0


కాసాని జ్ఞానేశ్వర్ తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. కాసానికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. భవిష్యత్‌లో చాలా అవకాశాలు ఉంటాయని ముదిరాజ్‌ నాయకులను తయారు చేసుకుని అందరికీ పదవులు ఇస్తామన్నారు. ఈటెల రాజేందర్ కన్నా పెద్ద మనిషి కాసాని జ్ఞానేశ్వర్ మన పార్టీలోకి వచ్చారని, ముదిరాజ్‌లకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. గజ్వేల్ నియోజక వర్గంలోని ఎర్రవల్లి కేసీఆర్ ఫాంహౌస్‌లో టీడీపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఎన్నికల తరువాత ముదిరాజ్‌లతో ప్రత్యేక సమావేశం అవుతానని చెప్పారు. వృత్తి పరంగా తెలంగాణలో ముదిరాజ్ లకు న్యాయం జరిగిందన్నారు. గ్రామాల్లో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ముదిరాజ్‌ల నుండి ఎక్కువ సంఖ్యలో నాయకులు తయారు అవ్వాలని, ఈసారి రాజ్యసభ, ఎమ్మెల్సీ, ఇతర నామినేటెడ్, మున్సిపల్ కార్పోరేషన్ మేయర్, జడ్పి, మున్సిపల్ చైర్మన్, స్థానిక సంస్థల పదవుల్లో ముదిరాజ్ లకు పెద్ద పీట వేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈటెల ఎవరిని ఎదగనివ్వలేదు, బండ ప్రకాష్ ని తీసుకొచ్చి ఎంపీ, ఎమ్మెల్సీ, కౌన్సిల్ వైస్ చైర్మన్ పదవులు ఇచ్చామని గుర్తు చేశారు కేసీఆర్. ఎన్నికల తరువాత ఎంతో అనుభవం ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో.. ముదిరాజ్‌ల సమస్యల పరిష్కారంపై తగు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాసాని జ్ఞానేశ్వర్ ఏడాది కిందటే బీఆర్ఎస్ లోకి రావాల్సి ఉండే, ఆలస్యమైనా రాజకీయంగా ఎంతో అనుభవజ్ఞులైన ఆయన రావడం మాకు శుభపరిణామం అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)