ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల పాటు వర్షాలు

Telugu Lo Computer
0


శ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం మరింత బలపడింది. ఇది తీవ్రవాయుగుండంగా మారింది. తీవ్ర వాయుగుండం మరింత బలపడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతానికి తీవ్రవాయుగుండం ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణిస్తుంది. ఈ ఉదయానికల్లా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో తీవ్ర వాయుగుండంగా మారనుంది. తీవ్ర వాయుగుండం విశాఖకు ఆగ్నేయంగా 380 కిలోమీటర్లు, ఒడిస్సా పారాదీప్ కు దక్షిణంగా 380 కిలోమీటర్లు, వెస్ట్ బెంగాల్ దిగాకు నైరుతి దిశ గా 530, బంగ్లాదేశ్ ఖేపు పారాకు నైరుతి దిశగా 680 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా తీవ్రవాయుగుండం క్రమంగా బలపడుతోంది.. 18వ తేదీ నాటికి మరింత బలపడి బంగ్లాదేశ్ వైపు వెళ్తుందని వాతావరణ శాఖ చెబుతోంది. బంగ్లాదేశ్ ఖేపు పార - మోంగ్లా మధ్య తీరం దాటుతుందని ఐఎండీ ప్రకటించింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఒడిస్సా పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఏపీ తీరంలోను బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగా ఇస్తున్నాయి. ఏపీలో చెదురు ముదురు వర్షాలు అక్కడక్కడ పడుతున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)