డేరా బాబాకు మళ్లీ పెరోల్ !

Telugu Lo Computer
0


బాలికలపై లైంగిక దాడులు, హత్యకు పాల్పడిన ఆరోపణలపై జైలు జీవితం గడుపుతున్న సిర్సా డేరా సచ్చా సౌదా చీఫ్ రామ్ రహీమ్‌ అలియాస్ డేరా బాబాకు మళ్లీ 21 రోజుల పెరోల్ ఇచ్చేందుకు హర్యానా ప్రభుత్వం నవంబర్ 20 న ఆమోదం తెలిపింది. డేరాబాబాకు శిక్ష పడిన తరువాత మూడేళ్లలో ఆయనకు ఇప్పటికి ఎనిమిది సార్లు పెరోల్ ఇచ్చారు. 2023 జూలై 20న గుర్మీత్ రామ్ రహీమ్‌కు హర్యానా ప్రభుత్వం 30 రోజులు పెరోల్ ఇచ్చారు. ఆగస్టు 15న తన పుట్టినరోజును జరుపుకొనేందుకు పెరోల్‌పై బయటికి వచ్చి బాగ్‌పత్‌లోని బర్వానాలోని తన ఆశ్రమంలో బస చేశాడు. తన తల్లి అనారోగ్యంతో ఉన్నందుకు కలిసేందుకు డేరా బాబా 2020 అక్టోబర్ 24 ఒక రోజు పెరోల్ ఇచ్చారు. మళ్లీ 2021 మే 21 వ తేదీన తనతల్లిని చూసేందుకు మరోరోజు ప్రభుత్వం అనుమతించింది. 2022 ఫిబ్రవరి 7 న 21 రోజులు, జూన్ 2022 లో మళ్లీ ఒక నెల రోజులు పెరోల్ ఇచ్చారు. ఆ తరువాత 2022 అక్టోబర్ లో 40 రోజుల పాటుపెరోల్ పూ విడుదలయ్యాడు. డేరా చీఫ్ షా సత్నాం జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు 2023 జనవర్ 21న 40 రోజులు పెరోల్ పై విడుదలయ్యాడు. జులై 2023 లో 30 రోజులు పెరోల్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ నవంబర్ 20, 2023 న 21 రోజుల పాటు పెరోల్ మంజూరు చేసింది. 2017లో ఇద్దరు మహిళలను లైంగికంగా వేధించిన కేసులో గుర్మీత్ రామ్ రహీమ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. సోమవారం (నవంబర్ 20) మంజూరైన 21 రోజుల పెరోల్‌తో గత మూడేళ్లలో 184 రోజులు పెరోల్‌పై ఉన్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)