తగ్గిన బంగారం, వెండి ధరలు !

Telugu Lo Computer
0


టీవల కాలంలో బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతోనే బంగారం ధరలో భారీ మార్పులు వస్తున్నట్లు మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. బంగారంపై రూ.660 మేర ధర తగ్గగా, వెండిపై రూ.2000 మేర ధర తగ్గింది. బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం  22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,380 గా ఉంది. వెండి కిలో ధర రూ.71,000 లుగా ఉంది. ఢిల్లీలో పది గ్రాముల పసిడి ధర రూ.52,750 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.57,530 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,600, 24 క్యారెట్ల ధర రూ.57,380, కోల్‌కతాలో 22 క్యారెట్లు రూ.56,600, 24 క్యారెట్ల ధర రూ.57,380గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.52,900, 24 క్యారెట్ల ధర రూ.57,710గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.52,600, 24 క్యారెట్ల ధర రూ.57,380, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.56,600, 24 క్యారెట్లు రూ.57,380గా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)