వెయ్యి రూపాయల నోటును తిరిగి ప్రవేశపెట్టే ఆలోచన లేదు !

Telugu Lo Computer
0


కేంద్రం పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత తిరిగి రూ.2వేల నోటను ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటివరకు వెయ్యి రూపాలయ నోటును ప్రవేశపెడుతున్నారంటూ పుంఖాను పుంఖలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ రిజర్వు బ్యాంక్ కీలకమైన ప్రకటన చేసింది. వెయ్యిరూపాయల నోటును తిరిగి ప్రవేశపెట్టే ఆలోచన తాము చేయడంలేదని స్పష్టం చేసింది. వస్తున్న వార్తలన్నీ ఊహాజనితాలని కొట్టి పారేసింది. స్పష్టత ఇచ్చిన ఆర్బీఐ : రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టబోతున్నారంటూ పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. దీనిపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అటువంటి ప్రతిపాదనలేవీ లేవని చెప్పారు. తాజాగా అదే ప్రశ్న మరోసారి పునరావృతం కావడంతో ఆర్బీఐ స్పష్టత ఇచ్చింది. దీన్నిబట్టి చూస్తే ఇప్పట్లో వెయ్యిరూపాయల నోట్లు మార్కెట్ లోకి వచ్చే పరిస్థితులు లేవనేది అర్థమవుతోంది. 2016 నవంబర్ లో రూ. 500, రూ.1000 కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత వాటి స్థానంలో కొత్త రూ. 500, రూ.2000 కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టారు. ఆ సమయంలోనే రూ.2వేల నోటును తీసుకొచ్చింది. అప్పుడే ఈ నోటు జీవితకాలం 5 నుంచి 6 సంవత్సరాలు మాత్రమే ఉంటుందని పేర్కొంది. ఈ ఏడాది మేలో వాటిని చలామణి నుంచి ఉపసంహరించుకున్నారు. క్లీన్ నోట్ పాలసీలో భాగంగానే దీన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ తెలిపింది. సెప్టెంబరు 30వ తేదీ వరకు రూ.2వేల నోటును మార్చుకోవడానికి అవకాశం కల్పించింది. ఆ తర్వాత అక్టోబరు 7వ తేదీ వరకు బ్యాంకుల్లో మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. ఇప్పటికీ ఎవరి వద్దనైనా రూ.2వేల నోటు ఉంటే ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకునే వీలుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)