23న టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ భేటీ - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday 20 October 2023

23న టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ భేటీ


నెల 23వ తేదీన రాజమండ్రిలో తెలుగు దేశం- జనసేన పార్టీలు తొలిసారి సమావేశం కానున్నాయి. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల అధ్యక్షతన టీడీపీ- జనసేన తొలి జయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరుగనుంది. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలు, ఇరు పార్టీల సమన్వయంపై ఈ కమిటీలో చర్చించనున్నారు. ఇప్పటికే జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులను టీడీపీ- జనసేన పార్టీలు ప్రకటించాయి. అయితే, ఈ కీలక సమావేశానికిక రాజమండ్రి వేదిక కానుంది. టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జైలులో ఉన్న రాజమండ్రినే భేటీకి వేదికగా ఇరు పార్టీలు నిర్ణయించారు. రాజకీయ కార్యక్రమాల స్పీడు పెంచేలా టీడీపీ- జనసేన పార్టీలు ప్రణాళికలు సిద్దం చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. 

No comments:

Post a Comment