జర్మన్ యూనిటీ డే సెలబ్రేషన్స్‌లో ఆర్ఆర్ఆర్ టీం ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday 22 October 2023

జర్మన్ యూనిటీ డే సెలబ్రేషన్స్‌లో ఆర్ఆర్ఆర్ టీం !


ర్మన్ యూనిటీ డే సెలబ్రేషన్స్‌లో ఆర్ఆర్ఆర్ మూవీ టీం సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కీరవాణి, రామ్ చరణ్ కనిపించారు. అక్టోబర్ 21 రాత్రి ఇండియాలోని జర్మన్ అంబాసడర్స్ మధ్య జర్మన్ యూనిటీ డే సెలబ్రేషన్స్‌ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి కీరవాణి హాజరుకాగా, రామ్ చరణ్ వీడియో కాల్ ద్వారా అందర్నీ పలకరించాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. కార్యక్రమానికి సంబంధించిన కొన్ని పిక్స్ ని జర్మన్ ఇండియా తమ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. ఇక ఈ కార్యక్రమంలో కీరవాణి వేదిక పై జర్మన్ లాంగ్వేజ్ లో పాట పాడి అందర్నీ ఉత్సాహపరిచాడు. ఆ తరువాత జర్మన్ అంబాసడర్స్ అంతా కలిసి నాటు నాటు సాంగ్ కి డాన్స్ వేసి అదరగొట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ ఈవెంట్ కి రాజమౌళి, ఎన్టీఆర్ హాజరుకాలేదని తెలుస్తుంది. కాగా నిన్న నైట్ మైత్రీ మూవీ మేకర్ నేషనల్ అవార్డు విన్నర్స్ కి ఒక పార్టీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కీరవాణి కనిపించకపోవడంతో.. ఆయన ఎందుకు రాలేదని సందేహాలు కొందరికి వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ పోస్టుతో ఆ డౌట్స్ కి ఒక క్లారిటీ వచ్చినట్లు అయ్యింది. ఈ ఈవెంట్ లో పాల్గొనడం వలనే కీరవాణి ఆ పార్టీకి రాలేకపోయాడని తెలుస్తుంది.

No comments:

Post a Comment