న్యాయవ్యవస్థను నమ్ముకోండి !

Telugu Lo Computer
0


సోంలోని గువాహటి కాటన్‌ యూనివర్సిటీలో ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌  మాట్లాడుతూ దేశ పాలనా యంత్రాంగాన్ని శానిటైజ్‌ చేసి, పవర్‌ బ్రోకర్లను లేకుండా చేశామని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ లేదా దర్యాప్తు సంస్థల నుంచి సమన్లు అందిన వెంటనే కొందరు వీధుల్లోకి వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 'మనకు పటిష్టమైన న్యాయవ్యవస్థ ఉంది. మనం దాన్ని ఎందుకు వినియోగించుకోకూడదు. మన కోర్టులు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయని' చెప్పారు. గతంలో చట్టం అందరికీ ఒకేలా వర్తించదు అనుకునే వారిని తాను చూశానని చెప్పారు. దళారీలు చెప్పినట్లే జరుగుతుందని, అవినీతి రాజ్యమేలుతోందని సాధారణ ప్రజలు అనుకునే వారన్నారు. ఆ రోజులు పోయాయని, ప్రస్తుతం పాలనా వ్యవస్థ నుంచి అవినీతి పూర్తిగా తొలగిపోయిందని ఉప రాష్ట్రపతి అన్నారు. ఒకానొక సమయంలో పాలనా వ్యవస్థలో మధ్యవర్తుల జోక్యంతో అవినీతి ఎక్కువగా ఉండేదని గుర్తు చేశారు. ఆ వ్యవస్థను పూర్తిగా శుద్ధి చేసి, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేయడంతో ప్రజలు సమర్థవంతమైన పాలనా ఫలితాలు అందుకుంటున్నారని చెప్పారు. మారిన పాలనా పరిస్థితుల కారణంగా సామాన్య ప్రజలు, విద్యార్థులు ఎక్కువగా ప్రయోజనం పొందుతున్నారని ఉప రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. యువత ముందుకొచ్చి అన్ని రంగాల్లో దేశాభివృద్ధికి పాటుపడాలని కోరారు. ''భారత్‌' గొంతుక ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో వినిపిస్తోంది. ఇది కొందరికి నచ్చడం లేదు. అందుకే భారత్‌ వ్యతిరేక కథనాలను రూపొందిస్తున్నారు. వాటిని తొలగించాల్సిన కర్తవ్యం మనదే' అని ఉప రాష్ట్రపతి పిలుపునిచ్చారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)