మధుమేహం - తినదగిన పండ్లు !

Telugu Lo Computer
0

ధుమేహంతో బాధపడేవారు ఏమి తెలినాలో ఏమి తినకూడదో అనే విషయంలో సరైన అవగాహనలేక వ్యాధిని మరింత తీవ్రతరం చేసుకుంటూ ఉంటారు. డయాబెటిక్ పేషెంట్లు అరటిపండ్లకు దూరంగా ఉండాలి. అరటిపండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు అరటిపండ్లు అంత ఆరోగ్యకరం కాదు. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు అరటిపండ్లకు బదులుగా యాపిల్ తినడం మంచిది. జామపండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారు జామపండు తింటే రక్తం చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. అలాగే జామ ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది. జామపండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారు జామపండు తింటే రక్తం చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. అలాగే జామ ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది. పైనాపిల్స్ పండ్ల కంటే బేరి పండ్లు చాలా ఆరోగ్యకరమైనవి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఖచ్చితంగా ఈ పండును తినాలి. దీనిలో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నందున పైనాపిల్స్ కంటే బేరిని ఆరోగ్యకరమైనదిగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బొప్పాయిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్‌ ఇ కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. హెపటైటిస్‌, హెచ్‌సీవీ సంబంధిత సమస్యలు రాకుండా కాపాడతాయి. డయాబెటిస్‌ ఉన్నవారు ఈ పండును తినవచ్చు. బొప్పాయి మానసిక సమస్యలు, ఒత్తిడి, ఆందోళనల వంటి మానసిక రుగ్మతలను సైతం నివారిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. చెర్రీ పండ్లలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుందని చెబుతారు. వీటికి బదులుగా నారింజ పండ్లు తినడం ఆరోగ్యానికి మంచి ఎంపిక. నారింజలో విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చెర్రీస్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాచి. నారింజలో ఆ లక్షణాలు ఉండవు. మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే నారింజను భేషుగ్గా తినవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)