ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదు : బండ్ల గణేష్

Telugu Lo Computer
0


వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ తరఫున కూకట్‌పల్లి నుంచి ఎమ్మెల్యేగా బండ్ల గణేష్ పోటీ చేయనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈసారి జరిగే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదని తెలిపారు. అసలు తాను టికెట్ కోసం కూడా దరఖాస్తు చేసుకోలేదని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ముఖ్యమని.. దాని కోసం పని చేస్తానని బండ్ల గణేష్ తెలిపారు. రేవంతన్న మీ ప్రేమకు కృతజ్ఞుణ్ని అని అన్నారు. తాను టికెట్ కోసం కూడా దరఖాస్తు చేయలేదని పేర్కొన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటమే తన ధ్యేయమని వ్యాఖ్యానించారు. తప్పకుండా పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పని చేస్తామని ఆయన వెల్లడించారు. ఇటీవలే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ పాదయాత్రలో బండ్ల గణేష్ పాల్గొన్నారు. గత ఎన్నికల్లోనూ బండ్ల గణేష్ కాంగ్రెస్‌కు ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)