హమాస్ కార్యాలయం కూల్చివేత !

Telugu Lo Computer
0


జ్రాయెల్‌-పాలస్తీనా మధ్య భీకర పోరు కొనసాగుతోంది. పాలస్తీనాకు చెందిన హమాస్ తీవ్రవాదుల మెరుపు దాడులను ఇజ్రాయెల్ సేనలు తిప్పికొడుతున్నాయి. గాజా ప్రాంతంపై ప్రతి దాడులను కూడా ముమ్మరం చేసింది. ఇరు వర్గాల మధ్య సాగుతున్న దాడి, ప్రతిదాడుల్లో ఇప్పటి వరకు 500 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. ఇజ్రాయెల్‌పై హమాస్ తీవ్రవాదులు వేలాది రాకెట్ల మెరుపు దాడులతో మారణ హోమం సృష్టిస్తున్నారు. అటు పాలస్తీనాపై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్‌.. గాజా ప్రాంతంలో బాంబుల వర్షం కురిపిస్తోంది. రెండు దేశాల మధ్య యుద్ధంలో ఇటు ఇజ్రాయెల్, అటు గాజా ప్రాంతాల్లో భారీ సంఖ్యలో అమాయక ప్రజలు బలయ్యారు. తమ దాడుల్లో ఇజ్రాయెల్‌కు చెందిన 300 మంది మృతి చెందగా.. మరో 1000 మంది వరకు గాయపడినట్లు హమాస్ తీవ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఇజ్రాయెల్ సేనలు జరిపిన దాడుల్లో గాజాలో 232 మంది మృతి చెందగా.. దాదాపు 1,700 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. భీకర దాడుల నేపథ్యంలో గాజా ప్రాంతం నుంచి వేలాది మంది పాలస్తీనియన్లు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. గాజా ప్రాంతంలో దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించడంతో వారు..కట్టు బట్టలతో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. గాజాలో హమాస్ తీవ్రవాదుల కార్యాలయమైన 14 అంతస్థుల భవనాన్ని ఇజ్రాయెల్ వైమానిక సేనలు కూల్చివేశారు. ఈ దాడుల్లో భారీ భవనం పేక మేడలా నిమిషాల వ్యవధిలో కుప్పకూలిపోయింది. అక్కడి నుంచి అమాయక ప్రజలు వెళ్లిపోవాలని ఆ భవనంపై దాడులకు ముందు ఇజ్రాయెల్ 10 నిమిషాల సమయం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)