రూ.1.60 లక్షల కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

Telugu Lo Computer
0

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రూ.1,62,712 కోట్లకు చేరింది. 2022తో పోలిస్తే సెప్టెంబర్ స్థూల జీఎస్టీ వసూళ్లు 10 శాతం పెరిగాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.8,93,334 కోట్ల జీఎస్టీ వసూళ్లు జరగ్గా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.9,92,508 కోట్లకు చేరాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లు దాటడం నాలుగో సారి అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ జీఎస్టీ వసూళ్లలో జీసీఎస్టీ రూ.29,818 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.37,657 కోట్లు, ఐజీఎస్టీ (దిగుమతి వస్తువులపై సుంకం రూ.41,145 కోట్లతో కలుపుకుని) రూ. 83,623 కోట్లు, దిగుమతి వస్తువులపై సుంకం రూ.881 కోట్లతో కలుపుకుని సెస్ రూ.11,613 కోట్లు వసూలయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)