ఒక్కొక్క తలపై రూ. రూ.1,13,571 అప్పు !

Telugu Lo Computer
0


బీజేపీ పాలనలో అప్పులు కుప్పలుతెప్పలుగా పెరిగిపోయాయి. తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో భారతీయుల మొత్తం అప్పు 2014 తో పోలిస్తే 2. 5 రెట్లు పెరిగింది. మార్చి 31, 2014 నాటికి భారత ప్రభుత్వంపై రూ. 55. 87 లక్షల కోట్లు అప్పుగా ఉంటే.. అది మార్చి 31, 2023 వరకు రూ. 155. 31 లక్షల కోట్లకు చేరింది. గడిచిన 67 ఏళ్లలో 14 మంది ప్రధానమంత్రులు కలిసి మొత్తం రూ. 55 లక్షల కోట్ల అప్పు చేస్తే.. నరేంద్రమోడీ గత తొమ్మిదేళ్లలో భారతదేశ అప్పును మూడింతలు పెంచారు. కేవలం తొమ్మిదేళ్లలో 100 లక్షల కోట్లకు పైగా అప్పు చేశారు. దాంతో దేశంలోని ప్రతి పౌరుడిపై అప్పుల భారం పెరుగుతోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం, ప్రభుత్వ స్థూల రుణంలో 2.2 శాతం పెరుగుదల నమోదైంది. దీంతో రుణాల సంఖ్య రూ.159 లక్షల కోట్లు దాటింది. అప్పులు పెరిగే ధోరణి ఇలాగే కొనసాగితే, ఈ సంఖ్య అతి త్వరలో రూ.160 లక్షల కోట్లు దాటే అవకాశం ఉంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వ మొత్తం స్థూల రుణంలో 2.2 శాతం పెరుగుదల నమోదైంది. దీని వల్ల ఇప్పుడు ప్రభుత్వ అప్పు రూ.159.53 లక్షల కోట్లకు పెరిగింది. ప్రస్తుత దేశ జనాభా 1 బిలియన్ 40 కోట్లు.. ఈ లెక్కన చూసుకుంటే దేశంలోని ప్రతి పౌరుడిపై ప్రస్తుతం రూ.1,13,571 కంటే ఎక్కువ అప్పు ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)