లక్నో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు !

Telugu Lo Computer
0


లక్నో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ ను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. ఈ బ్యాంక్ వద్ద సరిపడినంత మూలధనం లేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా తెలిపింది. అంతేకాకుండా ఈ బ్యాంక్ వద్ద ఆదాయ అంచనాలు కూడా లేకపోవడం వల్ల లైసెన్స్ రద్దు చేయాల్సి వచ్చిందని ఆర్‌బీఐ స్పష్టత ఇచ్చింది. అందు వల్ల ఇకపై ఈ బ్యాంక్ ఉండదు. ఆర్‌బీఐ ఇప్పటికే కమిషనర్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ ఉత్తరప్రదేశ్‌కు కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. బ్యాంక్ క్లోజింగ్‌కు లిక్విడేటర్‌ను నియమించాలని పేర్కొంది. బ్యాంక్ క్లోజ్ నేపథ్యంలో బ్యాంక్ లో డబ్బులు దాచుకున్న వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. అయితే డబ్బులు దాచుకున్న వారికి పూర్తిగా ఆ డబ్బులు వెనక్కి వస్తాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. గరిష్టంగా రూ. 5 లక్షల వరకు బ్యాంక్ తన కస్టమర్లకు చెల్లిస్తుంది. ఆ పైన డబ్బులు దాచుకున్న వారికి మాత్రం నష్టం కలుగుతుందని చెప్పుకోవచ్చు. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొషన్ (డీఐసీజీసీ) కింద బ్యాంక్‌లో డబ్బులు దాచుకున్న వారికి రూ. 5 లక్షల వరకు లభిస్తాయి. మీకు ఎన్ని అకౌంట్లు ఉన్నా కూడా ఈ లిమిట్ మించి డబ్బులు చెల్లించరు. అంటే మీకు ఒకే బ్యాంక్‌లో ఒక అకౌంట్‌లో రూ. 5 లక్షలు, మరో అకౌంట్‌లో రూ. 3 లక్షలు డిపాజిట్ చేసుకొని ఉంటే.. అప్పుడు మీకు రూ. 5 లక్షల వరకే వస్తాయి. మిగతా మొత్తాన్ని కోల్పోవలసి ఉంటుంది. అందుకే బ్యాంకలో డబ్బులు దాచుకునే వారు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. పెద్ద పెద్ద బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవడం ఉత్తమం. కోఆపరేటివ్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకునే వారు బ్యాంక్ ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవాలి. పని తీరును గమనిస్తూ ఉండాలి. ఇకపోతే ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం ఈ బ్యాంక్ ఇకపై డిపాజిట్లు స్వీకరించడం, చెల్లించడం వంటివి చేయదు. బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించదు. 

Post a Comment

0Comments

Post a Comment (0)