భగవద్గీతను బట్ట మీద నేసిన చేనేత కళాకారిణి !

Telugu Lo Computer
0


స్సాంలోని జోర్హాట్‌కి చెందిన చేనేత కళాకారిణి. చిన్నతనం నుంచి నేత పనిని వృత్తిగా మలుచుకుంది. ఎప్పుడూ ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచించేది. అదీ ఇప్పటి వరకూ ఎవరూ చేయనిది తాను చేయాలనుకుంది. ఆ ఆలోచనల నుంచి అద్భుతాలు రూపుదిద్దుకున్నాయి. 250 అడుగుల పొడవైన క్లాత్ మీద 700 పేజీల సంస్కృతంలో భగవద్గీతను నేసింది. అందుకు రెండు సంవత్సరాలు పట్టింది. అక్కడితో ఆగలేదు. ఇంగ్లీషు రాకపోయినా అక్షరాలు ముందు పెట్టుకుని ఇంగ్లీషులో సైతం భగవద్గీతను నేసేసింది. అస్సామీ పాఠాలను కూడా నేయడం మొదలుపెట్టింది. చిన్న క్లాత్ మీద ఓ డిజైన్ కుట్టాలంటేనే చాలా ఇబ్బంది పడిపోతాం. రోజులు, వారాలు చేస్తాం. అలాంటిది అన్ని అక్షరాలను అంత పెద్ద క్లాత్‌పై నేయడం అంటే ఎంత సహనం ఉండాలి. హెమోప్రోవా చుటియాలోని సహనం, టాలెంట్, క్రియేటివిటీ ఆమెను అద్భుతమైన చేనేత కళాకారిణిగా ప్రపంచం ముందు నిలబెట్టాయి. చాలామంది అది రాదు, ఇది రాదు అంటుంటారు. ఏ పనిలో అయినా మొదటి అడుగు వేయడానికే సంకోచిస్తారు. భాష రాకపోయినా భగవద్గీతను బట్టపై అలవోకగా నేసిన హెమోప్రోవా చుటియా అలాంటి వారికి ఆదర్శమని చెప్పాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)