గిట్టుబాటు ధర లేక గుండెలు బాదుకుంటున్న బెండకాయ రైతు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 2 September 2023

గిట్టుబాటు ధర లేక గుండెలు బాదుకుంటున్న బెండకాయ రైతు !


బెండకాయలు పండించిన రైతు గిట్టుబాటు ధర లేక గుండెలు బాదుకుంటున్నాడు. బెండకాయ ధర పతనమవడంతో రైతులు సంక్షోభంలో పడ్డారు. బహిరంగ మార్కెట్ లో బెండకాయ రూ. 40 లు ఉంటున్నా,రైతులకు మాత్రం కిలో రూ.2 మాత్రమే లభిస్తోంది. ”రెండు నెలలుగా కష్టపడుతున్నాం, అయినప్పటికీ కనీసం పెట్టిన ఖర్చులు కూడా లభించడం లేదని వాపోతున్నారు. తమిళనాడు తిరుపత్తూర్‌ మార్కెట్‌ యార్డ్‌లో తమ పంటను తామే చేతులారా నీటి పాలు చేస్తున్నాడు. కిలో బెండకాయలు రెండు రూపాయలు పలకుతుండటంతో రైతు నోటమాట రాలేదు. ఎన్నోఆశలతో పండించిన పంటకు పెట్టుబడి కూడా రాకపోవడంతో తీవ్ర ఆవేదన చెందిన ఆ యువ రైతు తీవ్ర అసహనంతో నిగనిగలాడే 5 టన్నుల బెండకాయలను నీటిలో పడేశాడు. రైతు కష్టం నీటిపాలైంది. నీటిలో తేలుతున్న టన్నులకొద్దీ బెండకాయలు చూస్తే రైతు ఎంత ఆవేదన చెందాడో అర్ధమవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

No comments:

Post a Comment